Homeసినిమాడైలీ గో మూత్రం తాగుతాః అక్ష‌య్

డైలీ గో మూత్రం తాగుతాః అక్ష‌య్

ముంబాయిః బాలీవుడ్ యాక్ష‌న్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది. డైలీ గో మూత్రం తాగుతాన‌ని ఓపెన్‌గా చెప్పిన ఆయ‌న మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. ఇటీవ‌ల అక్ష‌య్‌ వైల్డ్ లైఫ్ హీరో బేర్ గ్రిల్స్ తో క‌లిసి ‘ఇన్ టు ది వైల్డ్’ అడ్వెంచర్ అనే షో చేశారు. ఈ షోకి సంబంధించిన ముచ్చ‌ట్ల‌ను న‌టీ హ్యుమా ఖురేషితో ముచ్చ‌టించారు. బేర్ గ్రిల్స్‌తో కలిసి ఏనుగు పూప్ టీ తాగిన అనుభవం ఎలా అనిపించిందంటూ అక్షయ్‌ని ప్ర‌శ్నించిన హ్యూమా ఆయ‌న ఇచ్చిన ఆన్స‌ర్ విని ఆశ్చ‌ర్య‌పోయింది. ‘ఏనుగు పూప్ టీ తాగడం తనకు ఏ మాత్రం ఇబ్బందిగా అనిపించలేదని, ఎందుకంటే తాను ప్రతిరోజూ ఆవు మూత్రం తాగుతానని’ అక్ష‌య్ షాకింగ్ అన్స‌ర్ ఇచ్చాడు.

Recent

- Advertisment -spot_img