Homeహైదరాబాద్latest Newsఅక్షయ తృతీయ బంగారం కొనే రోజు కాదు.. దానం చేసే రోజు..!

అక్షయ తృతీయ బంగారం కొనే రోజు కాదు.. దానం చేసే రోజు..!

అక్షయ తృతీయ నాడు ఆహారం, వస్త్రాలు దానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని పెద్దలు చెబుతారు. అంతేగాదు ఈ రోజున ఏ కార్యాన్ని తల పెట్టినా నిర్విఘ్నంగా సాగుతుందని దాని ఫలితాలు అక్షయంగా లభిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకే అక్షయ తృతీయ రోజున తప్పకుండా దానధర్మాలు చేయాలని చెబుతారు. ముఖ్యంగా ఎండలు విపరీతంగా ఉండే ఈ కాలంలో ఉదకుంభదానం పేరుతో నీటితో నింపిన కుండను దానం ఇవ్వమని పెద్దలు సూచిస్తూ ఉంటారు. అలాగే అక్షయ తృతీయ శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మికి ఇష్టమైన, చాలా పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని భుజించకూడదు. మద్యం సేవించకూడదు. అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటున కూడా వెల్లి గడ్డలు, ఉల్లిగడ్డలతో వండిన ఆహారాన్ని తినకూడదని పండితులు చెబుతున్నారు.
అక్షయ తృతీయ శ్రీమహావిష్ణువుకు శ్రీమహాలక్ష్మికి ఇష్టమైన, చాలా పవిత్రమైన పండుగ రోజు కాబట్టి ఆరోజు పొరపాటున కూడా మాంసాహారాన్ని భుజించకూడదు. మద్యం సేవించకూడదు. అక్షయ తృతీయ నాడు మద్యం సేవిస్తే లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది. ఫలితంగా అనారోగ్యాల బారిన పడే అవకాశం కూడా ఉంటుంది. అక్షయ తృతీయ పండుగ నాడు పొరపాటున కూడా వెల్లి గడ్డలు, ఉల్లిగడ్డలతో వండిన ఆహారాన్ని తినకూడదని పండితులు చెబుతున్నారు. అలాగే అక్షయ తృతీయ నాడు బంగారం కొనే వారు వెంటనే దానిని అలంకరించడం తప్పు చెబుతున్నారు. బంగారం కొనుగోలు చేసిన వారు పెద్దల చేతుల మీదుగా పూజించిన తర్వాత దానిని అలంకరించుకోవాలి. ఎలా పడితే అలా బంగారాన్ని పెట్టుకోకూడదు. ఈ నియమాలన్నీ పాటిస్తే, అక్షయ తృతీయ మీకు సంపదలతో కూడిన అక్షయపాత్రను ఇస్తుంది. లేకుంటే అది పేదరికాన్ని తెస్తుందని పండితులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img