Homeహైదరాబాద్latest Newsనులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవాలి: మండల వైద్య అధికారి బత్తుల గీతాంజలి

నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేసుకోవాలి: మండల వైద్య అధికారి బత్తుల గీతాంజలి

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలో నులి పురుగుల నిర్మూలనలో భాగంగా మండల వైద్య అధికారిని బత్తుల గీతాంజలి ఆధ్వర్యంలో మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో వైద్య బృందం కలసి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు సందర్భంగా డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ 1 నుండి 19 సంవత్సరాల వయసున్న చిన్న పిల్లలతో పాటు యువత అనారోగ్యానికి కారణమవుతున్న నులి పురుగులను నివారించడానికి ఏటా రెండు సార్లు జాతీయ నులి పురుగుల నివారణ దినంగా పాటిస్తున్నారు నులి పురుగు వల్ల వలన పిల్లలకు రక్తహీనత సరైన ఎదుగుదల ఉండదని, వీటిని నియంత్రించి ఆరోగ్య సమాజ నిర్మాణానికి పునాది వేయాలని అన్నారుచిన్నారులు ఆల్బెండజోల్‌ మాత్ర లు తప్పని సరిగా వేసుకోవాలన్నారు. ప్రభుత్వం వీటిని ఉచితంగా పంపిణీ చేస్తున్నదని వివరించారు.మండల వ్యాప్తంగా 10,031మంది విద్యార్థిని విద్యార్థులు కు పంపిణి లక్ష్యం తో కార్యక్రమం చేపట్టగా 9,252మంది విద్యార్థులకు పూర్తి చేసినట్లు తెలిపారు అందుబాటులో లేకుండా మాత్రలు వేసుకొని వారిని గుర్తించి ఈ నెల లో27వ తేదీ నా వేస్తామని తెలిపారు ఈ కార్యక్రమం లో హెచ్ ఈ ఓ యాదగిరి ప్రధానోపాధ్యాయులు రవీందర్, ఏఎన్ఎం మణెమ్మ, కొల్లూరి రేణుక ఉపాద్యాయులు, రాజ్ మహామధ్ , శంకరయ్య,, వీరాస్వామి, ఎల్లారెడ్డి, రాజేంద్ర ప్రసాద్, ఆశా వర్కర్లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img