ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా సెక్టార్ 62లో ఉన్న నైనిటాల్ బ్యాంక్‌లో.. మోసగాళ్లు బ్యాంక్ సర్వర్‌ను ట్యాంపర్ చేసి, RTGS(రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ సిస్టమ్)ను హ్యాక్ చేశారు. దీని తర్వాత అక్రమార్కులు పలుమార్లు సుమారు రూ.16కోట్ల 1లక్ష 3వేలను వారి ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. బ్యాంకు బ్యాలెన్స్‌షీట్‌ను సరిదిద్దే సమయంలో ఈ విషయం వెల్లడైంది. నోయిడాలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.