తెలంగాణాలో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి DSC దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ప్రభుత్వం 11,062ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 3నాటికే గడువు ముగియాల్సి ఉండగా.. మార్చిలో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువును జూన్ 20వరకు పొడిగించింది. నిన్న సాయంత్రం వరకు 2.64లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 17 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.