తెలంగాణలోని జూనియర్ కళాశాలలకు వేసవి సెలవులు మే 31తో ముగియనున్నాయి. దీంతో ఇంటర్‌లో కొత్తగా చేరిన ప్రథమ సంవత్సరం విద్యార్థులతోపాటు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. జూన్ 30 నాటికి ఇంటర్ మొదటి దశ ప్రవేశ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. ఇవి పూర్తికాగానే.. రెండోదశ ప్రవేశాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల కానుంది.