విద్యార్ధులు, పేరెంట్స్‌కు బిగ్ అలర్ట్. ఏపీలో సంక్రాంతి సెలవులు కుదించే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకటించిన అకడమిక్ క్యాలెండర్ 2024-25ప్రకారం సంక్రాంతి సెలవులు జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు ప్రకటించారు. ఇప్పుడు ఈ సెలవుల్లో కోత పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఉండే అవకాశం ఉందని సమాచారం.