Homeహైదరాబాద్latest NewsAlert: హైదరాబాద్ లో భారీ వర్షం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

Alert: హైదరాబాద్ లో భారీ వర్షం.. అవసరమైతే తప్ప బయటకు రావొద్దు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!

హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షానికి పలు చోట్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. వాహనాలు నిదానంగా వెళ్లడంతో ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మలక్ పేట్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా రోడ్డుపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలోని హై టెక్ సిటీ, జూబ్లీహిల్స్, మాదాపూర్, కొండాపూర్, అమీర్ పేట్, మాసబ్ ట్యాంక్, టోలి చౌకి, మెహదీ పట్నం, అత్తాపూర్ లో వర్షం కురుస్తోంది.

Recent

- Advertisment -spot_img