Homeహైదరాబాద్latest NewsALERT: భారీగా పెరిగిన టమోటా ధరలు..మరింత పెరిగే అవకాశం..!

ALERT: భారీగా పెరిగిన టమోటా ధరలు..మరింత పెరిగే అవకాశం..!

ఎండలు పెరగడంతో టమోటా దిగుబడి భారీగా తగ్గిపోయింది. దీంతో డిమాండ్ పెరిగిపోయింది. నాలుగు రోజులుగా టమోటా ధరలు భారీగా పెరిగాయి. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండటంలేదు. రోజు, రోజుకు మరింత పెరిగిపోతున్నాయి. రెండు నెలల క్రితం రూ. 10 కూడా లేని ధర నాలుగు రోజులుగా రూ. 30కు చేరుకుంది. ఇప్పుడు ఏకంగా కిలో రూ. 40 పలుకుతోంది. పదిహేను కేజీల బాక్సు ధర రూ. 550 నుంచి 600 వరకూ పలుకుతోంది. టమోటాలు అధికంగా దిగుబడి అనంతపురంలో సైతం డిమాండ్ పెరిగింది. దిగుబడులు గణనీయంగా తగ్గడంతో ఏపీలోని పలు ప్రాంతాలు, చెన్నైలో గిరాకీ పెరిగింది. దీంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు టమోటా ధరలు మరింత పెరుగుతాయేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Recent

- Advertisment -spot_img