Homeహైదరాబాద్latest NewsAlert: దంచికొడుతున్న ఎండలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక..!

Alert: దంచికొడుతున్న ఎండలు.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక..!

తెలంగాణలో భానుడి భగభగలు తారాస్థాయికి చేరుకున్నాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతల మార్క్ ను దాటేసింది. ఉదయం నుంచే మొదలవుతున్న ఉక్కపోత వాతావరణం నెలకొంది. రాబోయే ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని తెలిపారు. నేటి నుంచి 15 జిల్లాలకు ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాడ్పుల ముప్పు అధికంగా ఉండనుందని తెలిపారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్ జిల్లాలకు అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

ఈ రోజు నుండి కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 3 నుంచి 4 డిగ్రీల మేర పెరగనున్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతతో ప్రజలు అవసరమైతేనే బయటకు రావాలని ఐఎండీ హెచ్చరించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 12 జిల్లాల్లో 40. 8 డిగ్రీల నుంచి 42. 3 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వెదర్ డిపార్ట్మెంట్ తెలిపింది. ఎండలు పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ‘ఆరెంజ్‌’ అలర్ట్ జారీ చేసింది. ఎండలో పని చేసే వారు, మధ్యాహ్నం పూట ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎక్కువగా ఎండలో తిరగరాదని హెచ్చరించారు. నీటిని ఎక్కువ మోతాదులో తీసుకోవాలని సూచించింది.

Recent

- Advertisment -spot_img