Homeక్రైంAll IT Rides Rs. 94 crore seized in India దేశవ్యాప్తంగా IT...

All IT Rides Rs. 94 crore seized in India దేశవ్యాప్తంగా IT Rides లో రూ. 94 కోట్లు Seize

– కాంట్రాక్టర్లు, బిల్డర్లు, నగల వ్యాపారుల
ఇళ్లలో 4 రోజుల పాటు సోదాలు
– వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రత్యక్ష పన్నల బోర్డు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ దాడుల్లో భారీగా డబ్బు, బంగారం స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకలోని ప్రభుత్వ కాంట్రాక్టర్లు, బిల్డర్లు, నగల వ్యాపారుల ఇళ్లలో ఇన్​కమ్​ ట్యాక్స్ అధికారులు జరిపిన దాడుల్లో భారీగా డబ్బు, బంగారం పట్టుబడినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) సోమవారం వెల్లడించింది.

కర్ణాటక, ఢిల్లీతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో మొత్తంగా 55 చోట్ల అక్టోబర్‌ 12 నుంచి కొనసాగించిన ఐటీ దాడుల్లో ₹94 కోట్ల డబ్బుతో పాటు రూ.8కోట్ల విలువచేసే బంగారం, వజ్రాభరణాలు, 30 లగ్జరీ వాచ్‌లను స్వాధీనం చేసినట్టు తెలిపింది. దాదాపు నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ దాడుల్లో లెక్కల్లోకి రాని డబ్బు, బంగారం, వజ్రాభరణాలు సీజ్‌ చేసినట్టు ఓ ప్రకటనలో పేర్కొంది. డబ్బుతో పాటు సీజ్‌ చేసిన వస్తువుల విలువ మొత్తంగా రూ.102 కోట్లు ఉండొచ్చని అంచనా వేసింది. అలాగే, వాచ్​ల వ్యాపారంతో సంబంధం లేని ఒక ప్రైవేట్ ఉద్యోగి ఇంట్లో 30 విదేశీ రిస్ట్‌ వాచ్‌లను సీజ్‌ చేసినట్టు సీబీడీటీ పేర్కొంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img