Homeహైదరాబాద్latest Newsబంగ్లాదేశ్‌పై ఆల్‌టైమ్ రికార్డు.. భారీ విజయంతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

బంగ్లాదేశ్‌పై ఆల్‌టైమ్ రికార్డు.. భారీ విజయంతో క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా

హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన మూడో టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే శనివారం టీమిండియా, బంగ్లాదేశ్ జట్టుల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓపెనర్ సంజూ శాంసన్ సెంచరీతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 7 వికెట్ల నష్టానికి 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత్ 133 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో భారత్ ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది.టీ20 ఫార్మాట్‌లో పరుగుల పరంగా బంగ్లాదేశ్‌పై ఏ జట్టుకైనా ఇదే అతిపెద్ద విజయం. బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2022లో దక్షిణాఫ్రికా 104 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ రికార్డును ఇప్పుడు టీమిండియా బ్రేక్ చేసింది.

Recent

- Advertisment -spot_img