Homeహైదరాబాద్latest Newsసెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’...

సెన్సార్ పూర్తి చేసుకున్న అల్లరి నరేశ్ ‘ఆ ఒక్క‌టీ అడ‌క్కు’…

మల్లి అంకం ద‌ర్శ‌క‌త్వంలో అల్లరి నరేశ్ హీరోగా వస్తున్న తాజా చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’. ఈ సినిమాలో ఫారియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌కి మంచి స్పందన వచ్చింది. ఈ మూవీ మే 3న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ స‌భ్యులు ఈ సినిమాకు U/A సర్టిఫికెట్‌ను జారీచేశారు. ఇక ర‌న్‌టైం విష‌యానికి వ‌స్తే.. 2 గంట‌ల 14 నిమిషాలు ఉన్నట్లు మూవీ టీమ్ తెలిపింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జామీ లీవర్, వైవా హర్ష, అరియానా గ్లోరీ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తునారు.

Recent

- Advertisment -spot_img