HomeసినిమాAllu Arjun: బ‌న్నీ పిల్ల‌లా.. మ‌జాకా.. డ్యాన్‌లో అదర‌‌గొట్టేశారు

Allu Arjun: బ‌న్నీ పిల్ల‌లా.. మ‌జాకా.. డ్యాన్‌లో అదర‌‌గొట్టేశారు

హైద‌రాబాద్ః ‘ఫ్రైడే నైట్‌ డ్యాన్స్‌ పార్టీ’ పేరుతో స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్ ఓ వీడియోను త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది.

అందులో అల్లు అర్జున్‌ కుమారుడు అయాన్‌, కూతురు అర్హా అతని కజిన్‌ హాలీవుడ్‌ మూవీ ఐటీలోని పెన్నీవైస్‌ను అనుకరిస్తూ డ్యాన్స్ చేయ‌డం అల్లు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

పిల్లల అల్లరి‌ చూసి బన్నీ నవ్వుతూ తెగ ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియో చూసిన అభిమానులు ‘ఎంత క్యూట్‌గా డ్యాన్స్‌ చేశారో’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం బన్నీ, సుకుమార్‌ రూపొందిస్తున్న ‘పుష్ప’ సినిమాలో నటిస్తున్నారు. మ‌రి కొద్ది రోజుల‌లో ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img