– అట్టహాసంగా 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
ఇదే నిజం, నేషనల్ బ్యూరో: పుష్ప–1 సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ జాతీయ పురస్కారం అందుకున్నారు. మంగళవారం ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులమీదుగా అల్లు అర్జున్ అవార్డును స్వీకరించారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నేషనల్ అవార్డు అందుకోబోతుండడం చాలా ఆనందంగా ఉందన్నారు. కమర్షియల్ చిత్రానికి (పుష్ప: ది రైజ్) జాతీయ అవార్డురావడమనేది డబుల్ అఛీవ్‌మెంట్ అని పేర్కొన్నారు.
అనంతరం ‘పుష్ప’లోని తగ్గేదేలే డైలాగ్ చెప్పి అలరించారు. సంబంధిత వీడియోను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోగా అది వైరల్‌గా మారింది. ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచిన ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాతలు రవిశంకర్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, దర్శకుడు రాజమౌళి (ఆర్‌ఆర్‌ఆర్), నిర్మాత అభిషేక్ అగర్వాల్ (ది కశ్మీర్ ఫైల్స్) అవార్డులు అందుకున్నారు. ‘కొండపొలం’ సినిమాలోని ‘ధమ్ ధమ్ ధమ్..’ పాటకు చంద్రబోస్‌కు ఉత్తమ గీత రచయితగా అవార్డు అందుకున్నారు.