Homeజిల్లా వార్తలుఅమాచ్ఛర్ రేడియో సెట్ అందజేత

అమాచ్ఛర్ రేడియో సెట్ అందజేత

ఇదే నిజం, దేవరకొండ: డిండి మండలం స్థానిక తెలంగాణ ఆదర్శ పాఠశాల విద్యార్థులు సౌత్ ఇండియాలోని గవర్నమెంట్ స్కూల్లో మొట్టమొదటి హమ్ రేడియో స్టేషన్ అయినా డి ఎ ఆర్ ఎస్ డిండిఎ మ్యాచ్యూఆర్ రేడియో స్టేషన్ లో ఇప్పటికే 51 మంది పిల్లలు మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ న్యూఢిల్లీ వారిచే లైసెన్స్ పొంది ఉన్నారు. వీరు ప్రతి సంవత్సరము ఎల్ ఏ ఆర్ సి లామాఖాన్ అనాక్యుర్ రేడియో క్లబ్ హైదరాబాద్ వారు నిర్వహించే కన్వెన్షన్ కి గత ఐదు సంవత్సరాలుగా హాజరు అవుతూ ఉన్నారు. అంతేకాక ఈకో లింకు ద్వారా రేడియో కమ్యూనికేషన్ చేస్తున్నారు. ఇటువంటి వైర్లెస్ రేడియో కమ్యూనికేషన్ లో ఉత్సాహంగా పాల్గొంటున్న కడారి శివాని( వియు3ఐవిఓ), ని ప్రోత్సహించడానికి వంటేద్దు విజయకుమార్ (వియు30యన్ఎఫ్), మరియు సయ్యద్ జిలాని(వియు3Oయన్ డి) వైర్లెస్ రేడియో సెట్ ని బహూకరించారు. భవిష్యత్తులో ఉత్సాహం కనబరుస్తున్న రేడియో లైసెన్స్ హోల్డర్స్ కి మరిన్ని హ్యాండ్ సెట్లు బహుకరిస్తామని సయ్యద్ జిలాని(వియు3Oయన్ డి) ఈ సందర్భంగా అన్నారు. దాదాపుగా 60 కొత్తవారు మరికొందరు జనరల్ గ్రేడ్ లైసెన్స్ మరియు రిస్ట్రిక్టెడ్ గ్రేడ్ లైసెన్స్ పొందడానికి దరఖాస్తు చేస్తున్నారు. అమాచ్చర్ రేడియో కమ్యూనికేషన్ అనేది కింగ్ ఆఫ్ హాబీస్. దీనిని లైసెన్స్ ఉన్నవారు మాత్రమే వాడుతారు.

Recent

- Advertisment -spot_img