Homeతెలంగాణఅంబేడ్కర్‌ సేవలు గొప్పవి

అంబేడ్కర్‌ సేవలు గొప్పవి

కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌
– రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి నివాళి

ఇదేనిజం, కరీంనగర్‌: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. బుధవారం అంబేద్కర్‌ వర్ధంతిని పురస్కరించుకొని కరీంనగర్‌లోని ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగం రాయడంతో పాటు భారత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎంతో శ్రమించారన్నారు. రిజర్వు బ్యాంక్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి దేశ స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు గట్టి పునాదులు వేశారని గుర్తు చేశారు. అలాగే అనేక ఉద్యమాలు చేసి సామాజిక న్యాయం అలుపెరుగని పోరాటం చేశారు. ముఖ్యంగా మహిళా హక్కుల కోసం నిరంతరం పోరాడిన బహుముఖ ప్రజ్ఞశాలి అని ప్రశంసించారు. కార్యక్రమంలో నగర మేయర్‌ సునీల్‌ రావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img