Homeఅంతర్జాతీయంటిక్‌టాక్‌, వీచాట్ యాప్‌లపై అమెరికా నిషేధం

టిక్‌టాక్‌, వీచాట్ యాప్‌లపై అమెరికా నిషేధం

వాషింగ్టన్‌: జిత్తుల‌మారి చైనాకు అమెరికా గ‌ట్టి షాక్ ఇచ్చింది. ముందునుంచి అన్న‌ట్టుగానే చైనాకు చెందిన టిక్‌టాక్‌, వీచాట్‌ యాప్‌లను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. ఆదివారం నుంచి ఈ రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్టు అమెరికా వాణిజ్య విభాగం ప్రకటనలో పేర్కొంది. అమెరికా పౌరుల వ్యక్తిగతమైన సమాచారాన్ని చైనా సేకరిస్తోందని, దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాణిజ్య విభాగం కార్యదర్శి విల్‌బర్‌ రోస్‌ వెల్లడించారు. 100 మిలియన్ల మంది అమెరికా పౌరుల సమాచారాన్ని ఈ రెండు యాప్‌లు యాక్సిస్ చేస్తున్నాయి. చైనాతో స‌రిహ‌ద్దు ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో టిక్‌టాక్‌, వీచాట్‌తో పాటు వందకు పైగా చైనా యాప్‌లపై భారత్‌ నిషేధం విధించిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img