HomeజాతీయంAmit Shah : సాంస్కృతిక వారసత్వాన్నికాపాడుకోవాలి

Amit Shah : సాంస్కృతిక వారసత్వాన్నికాపాడుకోవాలి

– అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందని ఎవరూ ఊహించలేదు
– కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: దేశంలో సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా పేర్కొన్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందని ఎవరూ ఊహించలేదని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి చేయడంతో పాటూ సాంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంతో అభివృద్ధి అనేవి రెండు విరుద్ధమైన అంశాలు కాదని తెలిపారు. దిల్లీలో జరిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ 69వ జాతీయ సమావేశంలో అమిత్‌ షా పాల్గొన్నారు. ‘విద్య కేవలం కెరీర్‌ను రూపొందించుకోవడానికి మాత్రమే కాదు.. దేశ నిర్మాణానికి కూడా అవసరం. దేశ యువత కోసం బంగారు భవిష్యత్తు ఎదురుచూస్తోంది. గత పదేళ్లలో దేశంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అవినీతి, బంధుప్రీతి, కులతత్వాన్ని అభివృద్ధి భర్తీ చేసింది. యువ శక్తే దేశానికి వెన్నెముక. దేశాభివృద్ధిని ముందుకు నడిపేది వారే. పలు సమస్యల పరిష్కారం కోసం ప్రపంచం మొత్తం భారత్‌వైపు చూస్తోంది. సాంస్కృతి వారసత్వాన్ని కాపాడుకోవడం, అభివృద్ధి రెండు విభిన్న అంశాలు కాదు. రామ మందిర నిర్మాణం జరుగుతుందని దేశంలో ఎవరూ అనుకొని ఉండరు’’ అని అమిత్‌ షా తెలిపారు.

Recent

- Advertisment -spot_img