Homeస్పోర్ట్స్అమితాబ్​ జీ..ఫైనల్​ మ్యాచ్​కు వెళ్లకండి ప్లీజ్​

అమితాబ్​ జీ..ఫైనల్​ మ్యాచ్​కు వెళ్లకండి ప్లీజ్​

– నెటిజన్ల కామెంట్లు
– బిగ్​ బీ సరదా రియాక్షన్​

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: బిగ్​ బీ అమితాబ్​ బచ్చన్​ ను ఉద్దేశించి నెటిజన్లు వినూత్న రీతిలో కామెంట్లు పెడుతున్నారు. అమితాబ్​ జీ మీరు ఫైనల్​ మ్యాచ్​ కు వెళ్లొద్దు ప్లీజ్​ అంటూ పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. బిగ్‌ బీ కూడా సరదాగా స్పందించడం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై భారత్‌ ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియాలో టీమిండియాకు అభినందనలు వెల్లువెత్తాయి. అమితాబ్‌ ఈ మ్యాచ్‌పై ఫన్నీగా పోస్ట్ చేశారు. ‘నేను మ్యాచ్ చూడకపోతే. ఇండియా కచ్చితంగా గెలుస్తుంది’ అని రాశారు. దీంతో నెటిజన్లు అమితాబ్​ కు విరుద్ధంగా కామెంట్లు పెడుతున్నారు.

Recent

- Advertisment -spot_img