ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన‘హనుమాన్’సినిమాతో భారీ హిట్ అందుకుంది చెన్నై భామ అమృత అయ్యర్. హనుమాన్ సినిమాలో ‘పూలమ్మే పిల్ల’పాట ఆమెకు మరింత పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటికీ ఆ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అమృత పుట్టింది చెన్నైలోనే అయినా చదింది మాత్రం బెంగుళురులోనే. చదువు పూర్తి అయిపోయాక ఏడాదిపాటు ఓ కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేసిన అమృత.. 2012లో ఓ మలయాళ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత లింగ, తేరీ లాంటి తమిళ సినిమాల్లో నటించింది. రామ్ నటించిన ‘రెడ్’సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన అమృత.. యాంకర్ ప్రదీప్ నటించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ సినిమాలోని ‘నీలి నీలి ఆకాశం’పాట అప్పట్లో ఎంత వైరల్ అయ్యిందో తెలిసిందే. ఆ తర్వాత శ్రీవిష్ణుతో అర్జున ఫాల్గుణ సినిమాలో నటించిన అమృతి.. ఈ ఏడాది హనుమాన్తో బ్లాక్ బ్లస్టర్ హిట్టు కొట్టింది. చిన్నప్పటి నుంచి గ్లామర్ ఫీల్డ్ అంటే ఆసక్తి ఎక్కువని చెబుతోన్న అమృత.. ఫిట్నెస్ను కాపాడుకోవాలంటోంది. ‘సినిమా అంటే ప్రాణం. ఇంట్లోవాళ్లు, స్నేహితులు కూడా ప్రోత్సహించారు. గ్లామర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు ఆహార నియమాలు తప్పనిసరి. ఫిట్‌నెస్ కాపాడుకోవాలి. అలాగని జిమ్‌కు వెళ్లను. ఇంట్లోనే తేలికపాటి కసరత్తులు చేస్తాను. చిన్నప్పటి నుంచి బాస్కెట్‌బాల్ బాగా ఆడేదాన్ని. దాంతో నా ఫిట్‌నెస్ మెరుగ్గా ఉంది’ అని చెప్పుకొచ్చింది అమృత.