Homeహైదరాబాద్latest Newsరెడ్డి సంఘంలో సో రీప్ కంపెనీ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

రెడ్డి సంఘంలో సో రీప్ కంపెనీ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం కేంద్రంలోని రెడ్డి సంఘంలో సో రీప్ కంపెనీ వారి ఆధ్వర్యంలో వరి ఆరబెట్టే విధానంలో సాగు చేయడం గురించి రైతులకు అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. వరి నార్లు వేసినటువంటి రైతులకు దిగుబడి రాక చాలా నష్టపోతున్నారు. ఎందుకంటే నాటు వేసిన రోజు నుండి నిండా నీరు పొలంలో ఉంచుతున్నాం కాబట్టి నిండ నీరు ఉండగా వరి మొక్కకు పిలుకలు రావడానికి అవకాశం ఉండదు. అలాగే పొలంలో నీరు నిండ ఉండి పొలం అంత లూజుగా మరియు నాచుతో ఉండడం చేత మితినే అనే విషవాయువు వెలువడి అది గాలిలో కలిసి కాలుష్యం ఏర్పడి భవిష్యత్తులో సకాలంలో వర్షాలు పడక భూగర్భ జలాలు అడుగంటి పోతాయి. దీనివల్ల ప్రజలకు మరియు రైతాంగానికి తీవ్రమైన నష్టం ఏర్పడుతుంది.ఈ సో రీప్ కంపెనీ వాళ్ళు చెప్పినట్టు సాగు చేస్తే రైతులకు ఎకరాకు రెండు పంటలు కలిపి 1000/- వేయి రూపాలు చెక్కు రూపంలో ఇస్తారు. ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని వేలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి రైతులు వారి ఆధార్ కార్డు జిరాక్స్,పట్టా పాస్ బుక్ జిరాక్స్ ఇచ్చి ఈ పథకంలో పేరు నమోదు చేసుకోగలరు. ఈ కార్యక్రమంలో సో రీప్ కంపెనీ ప్రచార బృందం సభ్యులు కుమార్, శ్రీనివాస్, తిరుపతి, గ్రామ రైతులు పాల్గొనడం జరిగింది.

ఈ విధానం ద్వారా ఉపయోగాలు :
పంట కు ఎంత నీరు అవసరమో అంతే పెట్టవచ్చు
నీటి వినియోగం ఎక్కువ కాకుండా చూడచ్చు
నీటి వృదా తగ్గించవచ్చు
వరిలో ఏర్పడే మీథేన్ వాయువు ను తగ్గించవచ్చు
వ్యవసాయ కాలుష్యాన్ని తగ్గించవచ్చు
భూసారం ను కాపాడుకోవచ్చు

Recent

- Advertisment -spot_img