Homeహైదరాబాద్latest News“పుష్ప 2 ది రూల్” నుంచి అదిరిపోయే అప్డేట్!

“పుష్ప 2 ది రూల్” నుంచి అదిరిపోయే అప్డేట్!

డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల పుష్ప 2 నుంచి మొదటి సాంగ్ ప్రోమో అని పుష్ప పుష్ప.. అంటూ సాగే ఓ చిన్న వీడియోని రిలీజ్ చేశారు. తాజాగా ఫుల్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు. రేపు సాయంత్రం 5:04 గంటలకు పుష్ప పుష్ప అంటూ సాగే పాటను తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ అప్డేట్ రిలీజ్ చేసిన పోస్టర్ లో అల్లు అర్జున్ స్టైల్ విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది.

Recent

- Advertisment -spot_img