Homeహైదరాబాద్latest Newsవామ్మో..మంచుపై యోగా చేసిన వృద్థుడు

వామ్మో..మంచుపై యోగా చేసిన వృద్థుడు

సున్నా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలో యోగా చేసి అందరి దృష్టిని ఆకర్షించారు ఐక్యరాజ్యసమితికి చెందిన ఓ అధికారి. చైనాలో ఐక్యరాజ్యసమితికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ్ ఛటర్జీ ఈ సాహసం చేశారు. చైనా రాజధాని బీజింగ్‌లోని గడ్డకట్టిన సరస్సుపై శీర్షాసనం వేసి యోగా చేస్తోన్న వీడియోలను ఆయన షేర్ చేశారు. ‘జన్మించిన శిశువు చేసే తొలి పని శ్వాస తీసుకోవడమే’ అంటూ ప్రాణాయామానికి ఉన్న ప్రాముఖ్యతను గురించి తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

Recent

- Advertisment -spot_img