వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేవలం సంక్షేమంపైనే దృష్టి సారించింది. అప్పులు తెచ్చి మరీ డబ్బులు పంచింది. అభివృద్ధిని గాలికి వదిలేసింది. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నా, పోలవరం పూర్తి కాకపోయినా, కడప స్టీల్ ఫ్యాక్టరీ నిర్మించకపోయినా, రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోయినా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించింది. పథకాలు ఇస్తున్నాం ఇంకేం కావాలని మంత్రులు మాట్లాడేవారు. దీనిపై విరక్తి చెందిన ప్రజలు కూటమికి పట్టం కట్టారు.