Homeజిల్లా వార్తలు40 ఏళ్ల ఉద్యోగంలో చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పిన అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ

40 ఏళ్ల ఉద్యోగంలో చిన్నారులకు విద్యాబుద్ధులు చెప్పిన అంగన్వాడీ టీచర్లు, ఆయాల ఉద్యోగ విరమణ

ఇదే నిజం, ముస్తాబాద్: పట్టణ కేంద్రంలో ముస్తాబాద్ మండలం బదనకల్ అంగన్వాడి టీచర్ ఎస్ భారతి, ముస్తాబాద్ టీచర్ తులసి భాయి, విమల మరియు నలుగురు ఆయాలు ఎల్లవ్వ నరసవ్వ, లక్ష్మి, మల్లవ్వ లు ఉద్యోగ విరమణ పొందగా స్థానిక సూపర్వైజర్ వడ్లకొండ అరవింద చంద్రమా ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పదవీ విరమణ పొందుతున్న టీచర్లను ఆయాలను పూలమాలలు శాలువాలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా లక్ష్మీరాజ్యం మాట్లాడుతూ… సమగ్ర శిశు అభివృద్ధి సంక్షేమ పథకంలో సుదీర్ఘకాలంగా పనిచేసే ఎంతోమంది చిన్నారులు గర్భిణీలు బాలింతలకు అమూల్యమైన సేవలను అందించారని వారిని కొనియాడారు. ప్రభుత్వ పథకాలను ప్రజల దర్శికి చేర్చిన వీరికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని ఉద్యోగ విరమణ చేసిన వీ సేవలను భవిష్యత్తులో వినియోగించుకుంటామని పేర్కొన్నారు. ఉద్యోగులకు ఉత్తమ సేవలతోనే గుర్తింపు వస్తుందని… ఉద్యోగ విరమణ చేసిన మీ సేవలు అవసరమేననీ జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజ్యం పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరవింద, అంగన్ వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img