ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా, ధర్మపురి పట్టణంలోని అంగన్వాడీలు మరియు ఆయా సిబ్బంది తమ డిమాండ్లు నెరవేర్చాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. గత 30 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మాకు ఎలాంటి లాభాలు లేవని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీలు మరణిస్తే ఇప్పుడు 20,000 ఇస్తున్నారు. దాన్ని రెండు లక్షల చేయాలని, ఆయా మరణిస్తే లక్ష రూపాయలు ఇవ్వాలని మరియు ఉద్యోగ విరమణ తర్వాత సగం జీతం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
గత ప్రభుత్వంలో 26 రోజులు సమ్మె చేస్తే జీతాలు ఇవ్వలేదని వాటిని కూడా విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆయా ఎల్లవ్వ మాట్లాడుతూ.. 30 సంవత్సరాలుగా వెంట్రుకలు నల్లగా ఉన్నప్పుడు వచ్చి వెంట్రుకలు తెల్ల పడే వరకు పనిచేసిన కానీ ఇలాంటి బోనస్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం వినతి పత్రాన్ని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సంఘనభట్ల దినేష్ కు ఇచ్చారు. దినేష్ మాట్లాడుతూ.. మీ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సి.ఐ.యు.టి.జిల్లా అధ్యక్షులు రఫీ, సురేష్, జయప్రద, సత్య, మణెమ్మ, ఎం శారద ,హరిప్రియ, రమాదేవి ,లక్ష్మి ,అనంతలక్ష్మి, జమున, శ్రీదేవి, రమాదేవి, సుజాత, రజిత ,లక్ష్మి అంగన్వాడి ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.