HomeEnglish‘Devara’కు Anirudh​ బ్రేకులు

‘Devara’కు Anirudh​ బ్రేకులు

Devara మూవీ కోసం తారక్​ ఫ్యాన్స్​ ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ మూవీలో Janvi Kapoor​ హీరోయిన్​ గా నటిస్తుండటం మరో విశేషం. ఇక RRR Movie తర్వాత మరో గట్టి హిట్ కొట్టాలని జూనియర్​ ఎన్టీఆర్​ కసితో ఉన్నారు. కొరటాల శివకు కూడా ఆచార్య వంటి డిజాస్టర్​ తర్వాత మరో హిట్​ కోసం గట్టిగా వెయిట్ చేస్తున్నారు. దీంతో దేవర మూవీ ఇటు తారక్​, అటు కొరటాలకు ఎంతో ముఖ్యం. ఇక జాన్వీ కపూర్​ కు ఫస్ట్​ తెలుగు మూవీ. ఈ మూవీ సక్సెస్​ అయితే ఆమెకు సౌత్​ లో విపరీతమైన అవకాశాలు వచ్చే చాన్స్​ ఉంది. మొత్తంగా ఈ ప్రాజెక్ట్​ అందరికీ ప్రత్యేకమే. కానీ దేవర రిలీజ్​ లేట్​ అవుతూ వస్తోంది. షూటింగ్ పార్ట్‌ పూర్తి అయ్యాక కూడా వీఎఫ్‌ఎక్స్ కు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. అందుకే ఏకంగా అక్టోబర్‌ కి సినిమాను వాయిదా వేస్తూ ఇటీవలే అధికారికంగా ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అక్టోబర్ 10న అయినా ఈ సినిమా వస్తుందా? అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దేవర సినిమా కోసం సంగీత దర్శకుడు అనిరుధ్ ఇంకా పూర్తి స్థాయిలో వర్క్ ను మొదలు పెట్టలేదట. కొరటాల శివ, అనిరుధ్‌ కాంబో మొదటి సారి అవ్వడం వల్ల మ్యూజిక్ సిట్టింగ్స్ కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దేవర సినిమా మాత్రమే కాకుండా అనిరుద్‌ చేతిలో డజను సినిమాలు ఉంటాయి. కనుక ఆయన ఎక్కువ సమయం కేటాయించడం కష్టం అంటూ స్వయంగా యూనిట్ సభ్యులు మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవర మూవీ మరోసారి కూడా వాయిదా పడుతుందా? అన్నది వేచి చూడాలి.

Recent

- Advertisment -spot_img