Homeహైదరాబాద్latest Newsఖబడ్దార్​..కౌశిక్ రెడ్డి : అంజన్ కుమార్

ఖబడ్దార్​..కౌశిక్ రెడ్డి : అంజన్ కుమార్

ఇదేనిజం, కరీంనగర్​ టౌన్​: మంత్రి పొన్నంపై చేసిన వ్యాఖ్యలను హుజూరాబాద్​ ఎమ్మెల్యే కౌశిక్​ రెడ్డి వెనక్కి తీసుకోవాలని తెలంగాణ పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్​ కుమార్ హెచ్చరించారు. కరీంనగర్​ లోని డీసీసీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే తిరుపతికి రైలు, మాతాశిశు హాస్పిటల్, ఎఫ్ఎం రేడియో, కేంద్రీయ విద్యాలయం, జేఎన్​ ఎంయూ బస్సులు తెచ్చారన్నారు. పొన్నం లాంటి నాయకులు పార్లమెంటులో ఉండడం గొప్ప విషయమని కేసీఆర్​ అభినందించిన విషయాన్ని గుర్తు చేశారు.

కౌశిక్ రెడ్డి పదవుల కోసం అధికార వ్యామోహంతో ఇప్పటికీ మూడు పార్టీలు మార్చారన్నారు. “కాంగ్రెస్ లోకి రావాలనే కుతూహలంతో తమ పార్టీ నాయకుల ఇండ్ల చుట్టూ ప్రదక్షిణలు చేసింది నిజం కాదా? “అని ప్రశ్నించారు. పొన్నంకు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కౌశిక్​ రెడ్డి చేస్తోన్న ఇసుక, అక్రమ దందాలు తమకు తెలుసన్నారు. త్వరలోనే అన్నీ బయట పెడతామని చెప్పారు. చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ నాయకులు పాండురాల లింగమూర్తి, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img