Homeహైదరాబాద్latest Newsఆత్మకూరులో అంగన్వాడీ కేంద్రంలో అన్న ప్రసన్న కార్యక్రమం

ఆత్మకూరులో అంగన్వాడీ కేంద్రంలో అన్న ప్రసన్న కార్యక్రమం

ఇదే నిజం,గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఆత్మకూరులో అంగన్వాడీ కేంద్రంలో అన్న ప్రసన్న కార్యక్రమం సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. 6 నెలలు దాటిన పిల్లలకు అంగన్వాడి కేంద్రంలో అన్న ప్రసన్న కార్యక్రమం నిర్వహించి, తల్లులకు ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు, ఆరు నెలలు దాటిన పిల్లలకు తల్లిపాలతో పాటు అనుబంధాహారం మొదలుపెట్టవలనని, తల్లి రోజు ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, గుడ్లు, పాలు, గింజ ధాన్యాలు తీసుకొనవలనని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఐసిడిఏ సూపర్వైజర్ మమత,అంగన్వాడి టీచర్ వసంత, తల్లులు, పిల్లలు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img