రోడ్డు రవాణా సంస్థలో విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడం శుభపరిణామమని గచ్చిబౌలి డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలి బస్‌డిపోలో మొత్తం 69 విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టారు. మూడు దఫాలుగా ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 20 రోజులుగా బస్సులను డిపోను నుంచి నడపడం జరుగుతుందని, నగరంలోని వివిధ ప్రాంతాలకు విద్యుత్ బస్సుల సర్వీసులు ఉంటాయని తెలిపారు.