యూజర్లకు ఎయిర్‌టెల్ మరో షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తన మూడు డేటా ప్లాన్‌ల ధరలను పెంచింది. రూ.79 డేటా ప్లాన్ ధరపై రూ.20 పెంచడంతో ఇప్పుడు రూ.99కి అందుబాటులో ఉంది. రూ.181 ప్లాన్ ధరపై రూ.30 పెంచింది. దాంతో ఈ ప్లాన్ ధర రూ.211కు చేరింది. ఇక రూ.301 డేటా ప్లాన్‌పై రూ.60 పెరిగింది. ప్రస్తుతం ఈ ప్లాన్ ధర రూ.361గా ఉంది.