Homeహైదరాబాద్latest Newsకేసీఆర్​ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు

కేసీఆర్​ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు

– బెదిరించి డబ్బులు తీసుకున్నట్లు ఫిర్యాదు చేసిన ఐటీ ఎంప్లాయ్
– కన్నారావుతో పాటు మరో ఐదుగురిపై కేసు ఫైల్ చేసిన బంజారాహిల్స్​ పోలీసులు


ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ అన్న కొడుకు కన్నారావుపై మరో కేసు నమోదైంది. ఆయనతో పాటు ఐదుగురిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన ప్రకారం.. తనను బెదిరించి డబ్బు తీసుకున్నట్లు ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వారిపై ఫిర్యాదు చేశాడు. గెస్ట్‌హౌస్‌లో నిర్బంధించి దాడి చేశారని అందులో పేర్కొన్నాడు. ఓ సమస్య పరిష్కారం కోసం కన్నారావు వద్దకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి విజయవర్ధన్ రావు వెళ్లారు. కన్నారావుకు పరిచయస్తురాలైన నందిని.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి వద్ద నగలు, డబ్బు ఉన్నాయన్న విషయం ఆయనకు తెలిపింది. సదరు మహిళతో పాటు మరికొంత మందితో కలిసి విజయవర్ధన్‌ రావును కన్నారావు గెస్ట్‌ హౌస్‌లో నిర్బంధించాడు. అతడిని బెదిరించి రూ.60 లక్షల డబ్బు, 97 తులాల బంగారం దోచుకున్నాడు. తనకు పోలీసు అధికారి భుజంగరావు, ఏసీపీ కట్టా సాంబయ్య తెలుసంటూ కన్నారావు బెదిరించాడని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మన్నెగూడ భూవివాదంలో ఇప్పటికే కన్నారావుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img