జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో విజయ్ దేవరకొండ VD12 అనే కొత్త సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి తాజా ఒక మాస్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మాస్ పోస్టర్ కి ఊర మాస్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఇది ఊచకోత పోస్టర్ అంటే ఇదే అంటూ విజయ్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజా చిత్ర నిర్మాత నాగవంశీ ఒక అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ చిత్రాన్నిరెండు పార్టులుగా అందించనున్నట్లు నిర్మాత నాగవంశీ తెలిపాడు. ‘విజయ్ సినిమా విషయంలో రిస్క్ తీసుకోవడంలేదు. రెండు పార్టులకు సరిపోయే కంటెంట్ ఉంది. మొదటి పార్ట్ ఫలితం ఆధారంగా రెండో పార్ట్ తెరకెక్కిస్తాం అని తెలిపారు. గౌతమ్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు’ అని ఆయన పేర్కొన్నాడు.