Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు మరో గుడ్​ న్యూస్​.. వయో పరిమితి పెంపు

నిరుద్యోగులకు మరో గుడ్​ న్యూస్​.. వయో పరిమితి పెంపు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: తాము అధికారంలోకి వచ్చిన వెంబడే నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి గద్దె నెక్కిన కాంగ్రెస్​ ప్రభుత్వం.. నిరుద్యోగులకు మేలు చేసేలా ఓ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటివరకు కొత్త పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఏవీ విడుదల చేయకపోయినప్పటికీ.. గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లకు సంబంధించి నియామకాలు చేపట్టింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు వయో పరిమితిని పెంచింది.వయోపరిమితిని 44 సంవత్సరాల నుంచి 46 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అయితే యూనిఫామ్ సర్వీసులకు మాత్రం ఈ మినహాయింపు వర్తించనున్నది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిఫాం సేవలకు కాకుండా.. మిగతా పోస్టులకు రెండు సంవత్సరాల కాలం ఈ వర్తింపు ఉంటుందని పేర్కొంది. ఈ నియమం ఏ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోసం వర్తించదు.. పోలీసు, ఎక్సైజ్, అగ్నిమాపక, జైళ్లు, అటవీ శాఖలు మొదలైన యూనిఫాం సేవలకు వర్తించదు.

Recent

- Advertisment -spot_img