Homeసినిమా‘గుంటూరు కారం’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్

‘గుంటూరు కారం’ నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్​టైనర్ గుంటూరు కారం. జనవరి 12 న వరల్డ్ వైడ్​గా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్​కు రెడీ అయిపోయింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫస్ట్ గ్లింప్స్, సాంగ్స్, ప్రమోషన్ ఫొటోలకు ఆడియెన్స్​తో పాటు ఫ్యాన్స్​ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా మేకర్స్ గుంటూరు కారం నుంచి మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్​ను రిలీజ్​ చేశారు. ఈ పోస్టర్​లో మహేష్ బాబు చాలా అందంగా కనిపిస్తున్నాడు. శ్రీలీల, మీనాక్షి చౌదరి లేడీ లీడ్ రోల్స్​లో నటిస్తున్న ఈ మూవీకి మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాపై ఆడియెన్స్​, మహేష్ ఫ్యాన్స్​లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

Recent

- Advertisment -spot_img