Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ మరో కీలక హామీ.. ఏంటంటే..?

సీఎం రేవంత్ మరో కీలక హామీ.. ఏంటంటే..?

సికింద్రాబాద్ ను జిల్లా గా ఏర్పాటు చేయాలని కోరుతూ గురువారం ఖైరతాబాద్ ఎమ్మెల్యే, సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోని నివాసంలో ముఖ్యమంత్రి ని కలిసి వినతిపత్రం అందజేసి జిల్లా ఏర్పాటు ఆవశ్యకత ను వివరించారు. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి ఎన్నికలు ముగిసిన అనంతరం జిల్లా ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు పవన్ కుమార్ గౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి దంపతులతో కూడిన చిత్రపటాన్ని అందజేశారు. జిల్లా ఏర్పాటు విషయంలో తనవంతు మద్దతు సహాయ సహకారాలు ఉంటాయని గతంలోనే ప్రకటించి నేడు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లిన దానం నాగేందర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి సాదం బాల్ రాజ్ యాదవ్, సభ్యులు అశోక్, కృష్ణ ముదిరాజ్, శ్రీకాంత్ రెడ్డి, జగ్గయ్య తదితరులు ఉన్నారు.

Recent

- Advertisment -spot_img