తమిళనాడులో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హామీ ఇచ్చారు. తమ పార్టీ (DMK) 2024 సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్లు స్టాలిన్ వెల్లడించారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌లో అత్యాధునిక హంగులతో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపడతామని స్టాలిన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.