Homeఆంధ్రప్రదేశ్#AP #Assembly : టీడీపీ తీర్మానాలు తిరస్కరణ

#AP #Assembly : టీడీపీ తీర్మానాలు తిరస్కరణ

Legislature meetings began at 10 a.m. Friday on the fifth day. Council chairman Sharif rejected the TDP’s adjournment motion to continue Amravati as the capital.

శాసనమండలి సమావేశాలు ఐదో రోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.

రాజధానిగా అమరావతి కొనసాగాలని టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ షరీఫ్‌ తిరస్కరించారు.

అమరావతిపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తూ సభను స్తంభింపజేశారు. కీలకమైన అంశాలపై చర్చ జరగాల్సి ఉందని చైర్మన్ వివరించినా వినిపించుకోలేదు.

దీంతో సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.

సభ ప్రారంభమైనప్పటి నుంచే ప్రతిపక్ష సభ్యులు గందరగోళం సృష్టించారు. గట్టిగా నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించారు.

ముఖ్యమైన బిల్లులు ఉన్నాయని, సహకరించాలని స్పీకర్ కోరినా టీడీపీ సభ్యులు వినలేదు. విపక్ష సభ్యుల గందరగోళం నడుమ పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది.

ప్రతిపక్ష సభ్యుల తీరును అధికార పక్షం తప్పుబట్టింది. టీడీపీ ఎమ్మెల్యేల నినాదాల నేపథ్యంలో 15 నిమిషాల పాటు సభను స్పీకర్‌ వాయిదా వేశారు.

విలువైన సమయాన్ని ప్రతి రోజు వృధా చేస్తున్నారని చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. స్పీకర్‌ స్థానాన్ని అవమానిస్తున్నారని మండిపడ్డారు.

ప్రతిపక్షాలు చెప్పిన ప్రతి అంశాన్ని చర్చిస్తున్నా ఈవిధంగా సభా కార్యకలాపాలను అడ్డుకోవడం తగదన్నారు.

కేవలం బురద చల్లాలనే ప్రయత్నంతోనే ఏదోరకంగా సభను ఆటంకపరచాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ శీతాకాల సమావేశాలు ఐదో రోజు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. పాడిపరిశ్రమ అభివృద్ధి – అమూల్‌తో భాగస్వామ్యంపై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు.

కరోనా నివారణ, ఆస్పత్రుల్లో నాడు-నేడుపై కూడా శాసనసభలో చర్చ జరుగుతుంది. నేడు శాసన మండలిలో ఐదు బిల్లులపై చర్చ జరగనుంది.

పోలవరం, టిడ్కో, స్కూళ్లల్లో నాడు-నేడుపై శాసనమండలిలో చర్చించనున్నారు.

Recent

- Advertisment -spot_img