వైసీపీ చీఫ్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. అసెంబ్లీ లోకి ఫ్లకార్డులతో వస్తున్న జగన్ను , వైసీసీ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకున్నారు. ఏపీ అసెంబ్లీ బయట వైసీసీ ఎమ్మెల్యేలను అడ్డుకుంటారా అంటూ జగన్ పోలీసులపై సీరియస్ అయ్యారు. తమ సభ్యుల చేతిలో ఉన్న ఫ్లకార్డులను ఎలా చించేస్తారని మండిపడ్డారు. తాను ఈ అంశంపై కేసు వేస్తే ఉద్యోగం ఊడిపోతుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల హక్కులు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. అధికారంలో ఉన్నవారికి సెల్యూట్ కొట్టడం కాదని చెప్పారు.
రాష్ట్రంలో హింస పెరిగిపోయి ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని నిరసన తెలిపారు. హత్యా రాజకీయాలపై సభలో చర్చకు పట్టుబడతామని అన్నారు. శాంతి భద్రతల అంశంలో అవసరమైతే గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని తెలిపారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయంటూ సభలో వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగంకు అడ్డు తగులుతున్నారు. ‘సేవ్ డెమోక్రసీ’ అంటూ నినాదాలు చేస్తున్నారు.