టీడీపీ అధినేత చంద్రబాబు ‘ప్రజాగళం యాత్ర’ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇవాళ కృష్ణా జిల్లాలో బహిరంగ సభలు, రోడ్ షోలు చేయనున్నారు. ఉదయం సత్తెనపల్లి నుంచి మధ్యాహ్నం పామర్రు చేరుకుని అక్కడి ఎన్టీఆర్ సర్కిల్‌లో ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు సెంటర్‌లో సభలో పాల్గొంటారు.