అమరావతిః ఏపీలో నివసించే వారు ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చని ఏపీ హైకోర్టు కీలక తీర్పుచ్చింది. ఒక్కో వ్యక్తి ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుచునేందుకు అవకాశం ఇచ్చింది. జీవో నెంబర్ 411 ప్రకారం.. ఇతర రాష్ట్రాల నుంచి పరిమిత సంఖ్యలో మద్యాన్ని తీసుకొచ్చుకునే వెసులుబాటు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఏపీ పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని కోర్టులో దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారించింది. మద్యపాన నియంత్రణ కోసం ఏపీ సర్కార్ లిక్కర్ రేట్లను భారీగా పెంచడంతో మద్యం అక్రమ రవాణా ఇటీవల ఎక్కువైంది
పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చు: ఏపీ హైకోర్టు
RELATED ARTICLES