Homeహైదరాబాద్latest NewsAP : SSC ఫలితాలు విడుదల

AP : SSC ఫలితాలు విడుదల

ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 86.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఉత్తీర్ణత వివరాలను విద్యా కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ వివరించారు. బాలికలు 89.17 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 84.32 శాతం పాసయ్యారు. 2,803 పాఠశాలలు 100శాతం.. 17 స్కూళ్లలో సున్నా ఉత్తీర్ణత నమోదైంది.

ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

96.37 శాతంతో పార్వతీపురం మన్యం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 62.47 శాతంతో కర్నూలు చివరి స్థానం దక్కించుకుంది. ఏపీ రెసిడెన్షియల్‌, బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 98.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో 96.72 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఏపీ మోడల్‌ స్కూళ్లలో 92.88 శాతం, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 94.56, ఆశ్రమ పాఠశాలల్లో 90.13 శాతం, కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 88.96 శాతం, ట్రైబల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో 89.64 శాతం, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో 79.38 శాతం, ప్రైవేటు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 80.01 శాతం, మున్సిపల్‌ హైస్కూళ్లలో 75.42 శాతం విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో 74.40 శాతం విద్యార్థులు పాసయ్యారు.

Recent

- Advertisment -spot_img