Homeహైదరాబాద్latest NewsAP : ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్

AP : ప్రచారంలో పాల్గొననున్న వరుణ్ తేజ్

Andhra Pradesh Assembly Elections : ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం అభ్యర్ధి పవన్ కల్యాణ్ తరఫున మెగాప్రిన్స్, హీరో కొణిదెల వరుణ్ తేజ్ పాల్గొననున్నారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మద్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలవుతుందని జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచార ర్యాలీ, రోడ్‌షో, సమావేశాల్లో వరుణ్ తేజ్ ప్రసంగిస్తారని చెప్పారు. జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. జనసేన నాయకులు పంచకర్ల సందీప్, జ్యోతుల శ్రీనివాస్, పిల్లా శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img