– కాంగ్రెస్ హైకమాండ్ ప్రకటన
– తక్షణమే అమల్లోకి నిర్ణయం
– సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు
ఇదేనిజం, ఏపీ బ్యూరో: ఏపీసీసీ చీఫ్గా వైఎస్ షర్మిలను నియమించారు. ఈ మేరకు మంగళవారం కాంగ్రెస్ హైకమాండ్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు పీసీసీ చీఫ్గా ఉన్న గిడుగు రుద్రరాజును సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. షర్మిలకు ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించబోతున్నట్టు చాలా రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలే ఆమె ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ పెద్దల సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. మరి షర్మిల ఏపీలో తన మార్క్ ఏ మేరకు చూపిస్తారో వేచి చూడాలి. ఆమె సోదరుడు వైఎస్ జగన్ ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు షర్మిల నేరుగా జగన్ మీద అటాక్ చేయబోతున్నారు. షర్మిల ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపడుతుండటం ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.