Homeహైదరాబాద్latest Newsయాపిల్ యూజర్లకు కొత్త ఫీచర్..కంటిచూపుతోనే

యాపిల్ యూజర్లకు కొత్త ఫీచర్..కంటిచూపుతోనే

టెక్ దిగ్గజం యాపిల్ ఐఓఎస్ యూజర్ల కోసం కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దివ్యాంగులు కూడా సులభంగా యాక్సెస్ చేసేందుకు వీలుగా ఈ ఫీచర్లు ఉండనున్నాయి. ఐట్రాకింగ్, మ్యూజిక్ హాప్టిక్స్, వోకల్ షార్ట్‌కట్స్ వంటి ఫీచర్లను ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి తీసుకురానున్నట్లు యాపిల్ తెలిపింది. కేవలం కంటిచూపుతోనే ఫోన్, ఐప్యాడ్ లోని యాప్స్‌ను కంట్రోల్ చేసే వీలు ఈ ఫీచర్లతో ఉండనుంది. గూగుల్ కూడా ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ప్రాజెక్ట్ గేమ్ ఫేస్ పేరుతో ఇలాంటి టెక్నాలజీనే త్వరలో మార్కెట్లోకి తీసుకురానున్నట్లు ఇప్పటికే తెలిపింది.

Recent

- Advertisment -spot_img