Homeహైదరాబాద్latest Newsఉచిత విద్యుత్​ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి (సోలార్​ రూప్ టాప్​)

ఉచిత విద్యుత్​ కోసం ఇలా దరఖాస్తు చేసుకోండి (సోలార్​ రూప్ టాప్​)

కేంద్ర ప్రభుత్వం కోటి ఇండ్లకు ఉచితంగా విద్యుత్ తీసుకొచ్చేందుకు ‘సూర్య ఘర్’ అనే పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ​సోలార్​ విద్యుత్​ ఉపయోగించి విద్యుత్ వినియోగదారులకు భారాన్ని తగ్గించడమే ఈ పథకం ఉద్దేశ్యం. అయితే ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలో.. కేంద్ర ప్రభుత్వం ఇందుకోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరి దీని కింద ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం ఎలా అప్లై చేసుకోవాలి..? ఆ వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.

ముందుగా ఈ పోర్టల్‌లో మీరు పేరును రిజిస్టర్‌ చేసుకోవాలి. మీ రాష్ట్రం, విద్యుత్‌ సరఫరా చేసే కంపెనీని ఎంచుకోవాలి. మీ విద్యుత్‌ కనెక్షన్‌ కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరు, ఈ-మెయిల్‌ ఐడీని ఎంటర్ చేయాలి. పోర్టల్‌లో ఉన్న నియమ నిబంధలను అనుగుణంగా రిజిస్ట్రేషన్‌ పూర్తి చేయాలి. ఆ తర్వాత కన్జ్యూమర్‌ నంబరు, మొబైల్‌ నంబరుతో లాగిన్‌ అవ్వాలి. అక్కడ ‘రూఫ్‌టాప్‌ సోలార్‌’ కోసం అప్లై చేసుకోవాలి. దరఖాస్తు పూర్తి చేసి డిస్కమ్‌ నుంచి అనుమతులు వచ్చేవరకు వేచి చూడాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కమ్‌లోని నమోదిత విక్రేతల నుంచి సోలార్‌ ప్లాంట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. ఇన్‌స్టలేషన్‌ పూర్తయిన తర్వాత, ఆ ప్లాండ్‌ వివరాలను పోర్టల్‌లో సమర్పించి నెట్‌ మీటర్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలి. నెట్‌ మీటర్‌ను ఇన్‌స్టాల్‌ చేశాక, డిస్కమ్‌ అధికారులు తనిఖీలు చేస్తారు. అనంతరం పోర్టల్‌ నుంచి కమిషనింగ్‌ సర్టిఫికేట్‌ ఇస్తారు. ఇందుకు సంబంధించిన సబ్సిడీ మీ ఖాతాలో జమ అవుతుంది.

Recent

- Advertisment -spot_img