తెలంగాణ డీఎస్సీ -2024 ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి సోమవారం సచివాలయంలో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘అతితక్కువ సయంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించాం. పది నెలల్లోనే 11 వేల పోస్టులను భర్తీ చేస్తున్నాం. అక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేస్తాం. 1:3 నిష్పత్తిలో వెరిఫికేషన్ ఉంటుంది. తొందర్లోనే గ్రూప్-1 ఫలితాలను ప్రకటిస్తాం’ అని అన్నారు.