సోంపు గింజల్లో అనేక పోషకాలు ఉంటాయి. ఈ గింజల్లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, పొటాషియం, మెగ్నిషియం సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల ఈ గింజలను భోజనం తర్వాత తింటే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. వీటిని నోటిలో వేసుకుని నమిలితే నోటిలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దీంతో నోరు శుభ్రమవుతుంది. నోటి దుర్వాసన నుంచి విముక్తి లభిస్తుంది. దీనిలో ఉండే పొటాషియం శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది.