ఈరోజుల్లో దాదాపు ప్రతి ఒక్కరి ఇళ్లలో Wi-Fi ఉంటుంది. చాలా ఇళ్లలో Wi-Fi రౌటర్ పగలు మరియు రాత్రి ఆన్ లోనే ఉంటుంది. కాబట్టి దాదాపు 99 శాతం మంది Wi-Fi ఆన్‌లో ఉంచుకుని నిద్రపోతారు. కానీ దీని వల్ల చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ ఇంటి Wi-Fi రౌటర్‌ను రాత్రంతా ఆన్‌లో ఉంచితే, దాని నుండి వెలువడే రేడియేషన్ కారణంగా చాలా వ్యాధులకు కారణమవుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. Wi-Fi రేడియేషన్‌కు నిరంతరం గురికావడం పురుషుల పునరుత్పత్తి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. రాత్రంతా రౌటర్‌ను ఆన్‌లో ఉంచడం వల్ల క్యాన్సర్, నాడీ సంబంధిత సమస్యలు మరియు పునరుత్పత్తి సమస్యలు వస్తాయి. ఫలితంగా, అల్జీమర్స్ వచ్చే ప్రమాదం ఉంది. నిద్రించే ప్రాంతానికి సమీపంలో రూటర్ ఉండడం వల్ల మెదడుపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది నిద్రలేమి, అలసట, మైగ్రేన్ వంటి సమస్యలను కూడా కలిగిస్తుందని వారు సూచిస్తున్నారు. అందుకే నిద్రపోయేటప్పుడు కచ్చితంగా వైఫై రూటర్ ఆఫ్ చేయాలని అంటున్నారు.